జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామంలో మల్గా కుమార్ శ్రీవాణి దంపతుల కుమారుడు మల్గ వరుణ్ పదవ తరగతిలో మండల టాపర్ గా నిలవగా ఇటీవల బాసర ఐఐటీలో సీటు రావడం జరిగింది. కానీ సరస్వతీ కనికరించిన లక్ష్మీ కనికరించలేదు అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి రెక్కాడితే గాని డొక్కాడని వారి తల్లిదండ్రుల పరిస్థితిని చూసిన కోడూరు శివకుమార్ గౌడ్ అతని చదువులకయ్యే ఖర్చుకు తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మల్గ సిద్ధిరాములు, వడ్ల నరసయ్య, పట్టంశెట్టి భద్రయ్య, ఎండి ఇమ్రాన్, పిట్టల బాలరాజు, పసుల రమేష్, దాసరపు కరుణాకర్, మల్గ నాగయ్య, మల్గ సతీష్, పసుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.