GHMC మల్లాపూర్ డివిజన్ పరిధిలో థీమ్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
థీమ్ పార్కులో అసంపూర్తిగా ఉన్న ఇంజినీరింగ్ పనులకు మరిన్ని నిధులు అవసరం ఉన్న నేపథ్యంలో ఈస్ట్ జోన్, జోనల్ కమిషనర్ తో నిధుల విషయమై చారవణిలో మాట్లాడారు, సానుకూలంగా స్పందిస్తు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు తండా వాసుగౌడ్, ఫైళ్ల ప్రవీణ్, పద్మరెడ్డి, ప్రభాకర్ రెడ్డి దుల్మీట్ట దయాకర్ రెడ్డి, మారుతి రావు, ముత్యాలు, సంతోష్ యాదవ్, నర్సింగరావు, పరమేష్ రెడ్డి, రాపోలు శ్రీనివాస్, మెండ రఘు, రమేష్, వెంకటాచారీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.