హైదరాబాదు లోని ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్ నగరంలోని హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో పాటుపడిందని భవిష్యత్తులో తెలంగాణలో కూడా టిడిపిని అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పాలా ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రతి నెల రెండవ శనివారం, ఆదివారం తెలంగాణకు వస్తానని అన్నారు. కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ పై సమావేశాలు, సలహాలు, సూచనలు ఉంటాయని అన్నారు.
పార్టీ నిర్మాణం పైనే దృష్టి.. త్వరలో గ్రామస్తాయి నుండి పార్టీ నిర్మాణం
పార్టీ నిర్మాణం పైనే పూర్తిస్థాయిలో దృష్టి ఉంటుందని త్వరలో గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం, పటిష్టం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు చంద్రబాబు ఆదేశించారు.
15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాటి పూర్వ వైభవం సంతరించు కుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
యువకులకు, బీసీలకు పెద్దపీట ఉంటుందని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా తెలుగు ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.