కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే ఇవ్వాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య
గత సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ శక్తులను వెంటనే ఇవ్వాలని పేదింటి మహిళల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పేదింటి మహిళల వివాహం కొరకు అందజేస్తున్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ లక్ష16తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో చెక్కులు వచ్చి ఉన్నాయని కానీ కుటుంబాలకు పంపిణీ చేయడం లేదని అన్నారు ఆధునిక సమాజంలో అప్పులు చేసి పెళ్లి చేస్తున్న పరిస్థితుల్లో కుటుంబాలకు అండగా ఉంటున్నటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల ప్రభుత్వం చెక్కులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు ఆ చెక్కులు ఇవ్వడం ద్వారా మహిళల కుటుంబాలకు అప్పుల భారం తగ్గుతుందని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిచో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపడతామని తెలిపారు