➡️సందబోయిన ఎల్లయ్య సిపిఎం.
సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య అన్నారు సిపిఎం పార్టీ గజ్వేల్ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏచూరి గారు విద్యార్థి ఉద్యమం ఎస్ఎఫ్ఐ నుండి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారని అన్నారు రాజ్యసభకు రెండు దఫాలుగా ఎన్నిక కావడం జరిగిందని పార్లమెంట్లో అనేక సవరణలు ప్రతిపాదన చేసి ఓటింగ్ పెట్టిన నెగ్గిందని అన్నారు భారత పార్లమెంటు బృందానికి నాయకత్వం వహించి ఐక్యరాజ్యసమితిలో మూడు సార్లు ప్రసంగించారని అన్నారు ఉన్నత విద్యావంతుడు,బహుముక ప్రజ్ఞాశాలి, మేధావి అని 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే వారిని అన్నారు ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగిన ఉద్యమాలకు అండదండస్తూ నిలబడే వారని అన్నారు సిపిఎం పార్టీ అగ్ర నాయకులు సుందరయ్య గారితో జ్యోతిబసు గారితో హరి కిషన్ సింగ్ సుర్జిత్ ఏకే గోపాలన్ వంటి అగ్ర నాయకులతో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వ విధానాలపై అవగాహన పెంచుకున్నాడని అన్నాడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అధ్యక్షునిగా మూడుసార్లు ఎన్నికయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట చారి, అఫ్జల్, సమీర్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు