**విద్యార్థుల నుండి పన్నులు వసూలు చేస్తారు కానీ స్కాలర్షిప్, రీయింబర్స్ మెంట్ మాత్రం విడుదల చేయర… ?***సరిపడా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయరు ఎలాగైనా చదవాలని ప్రైవేట్ లో చేరితే రియంబర్స్ మెంట్ కూడా విడుదల చేయర..?*భరత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8500 కోట్ల రూపాయల స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ లను తక్షణమే విడుదల చేయాలని సిద్దిపేట కలెక్టర్ ఏవో అబ్దుల్ రహమాన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుడికందుల రవి, చంధ్లాపురం మధు లు మాట్లాడుతూ 9 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కానీ ప్రజల కష్టాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, అందులోనూ విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకోవాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సరిపడా సీట్లు ఉండవు అలా అని ప్రైవేట్ లో చేరితే చదువు పూర్తయ్యాక రియంబర్స్మెంట్ విడుదల కాలేదని కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వరు, పై చదువులకు వెళ్దామంటే సర్టిఫికెట్లు లేకపోతే వెల్లలేని పరిస్థితి. చదవకపోతే కూలి, నాలి చేసుకుని బ్రతకాలి అని అదో భయం. కానీ విద్యార్థుల నుండి మాత్రం కాళ్ళకు వేసుకొనే చెప్పులు మొదలుకొని జడలు వేసుకొనే రిబ్బన్ల వరకు అన్నిటి మీద పనులు మాత్రం వసూలు చేస్తుంది, కానీ ఆ పన్నుల్లో కొంత భాగం స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయమంటే మాత్రం ముఖం చాటేస్తుంది. ఈ పరిస్థితి గనుక ఇలానే కొనసాగితే విద్యార్థుల యొక్క కోపానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూట, ముళ్ల సదురుకుని పారిపోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా నాయకులు రామస్వామి, వినయ్, శ్రావణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.