చాక్లెట్ ఆశ చూపి – బాలికను కిడ్నాప్ ?* వివరాలోకి వెళ్తే గ్రామస్తులు తేలిపిన వివరాల ప్రకారం దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన రాములు లక్ష్మిల కుమార్తె పల్లవి స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వతరగతి చదువుతోంది. కాగా సోమవారం పల్లవి 11గంటల సమయంలో స్నేహితురాలు తో ఇంటికి నోట్బుక్ కోసం వెళ్లగా కారులో వచ్చిన దుండగులు చాక్లెట్ ఇస్తామని ఆశ చూపి బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లారు వద్దనిచెప్పిన పల్లవిని దుండగుడు కారు డిక్కీలో వేసుకొని వెళ్లిపోయారు. ఉదయం సుమారు 12 గంటల ప్రాంతం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బాలికను కారులో బంధించి వివిధ ప్రాంతాలను తిప్పిన దుండగులు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తిరుమలాపూర్ గ్రామ సమీపంలో బాలిక పల్లవిని విడిచి వెళ్లారు. కాగా అనంతరం బాలిక కుటుంబ సభ్యులు దౌల్తాబాద్ పో లీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో ఉన్న సిసి టీవీల పుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. దుండగులను త్వరగా పట్టుకోవాలి: బాలిక తండ్రిరాములు ప్రశాంతమైన పల్లెలో కిడ్నాప్ లకు పాల్పడే దుండగులు వచ్చి పిల్లలను తీసుకెళ్లడం తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.