చిన్నారులను ప్రోత్సహించేందుకు బుచేశ్వరావు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చిన్నారుల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేందుకు బుచ్చేశ్వరావు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అన్నారు.ఆదివారం ఒంగోలులో మల్లయ్య లింగం భవన్ లో జరిగిన సకల కల్చరల్ అకాడమీ మరియు లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నాట్య సమ్మేళనం మరియు జాతీయ సేవా పురస్కారాల వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.చిన్నారుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు.ప్రతిచోట ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం వుందని అన్నారు.బుచ్చేశ్వరావు ఆధ్వర్యంలో అందర్నీ ఒకే వేదికపై చేర్చి వారిని ప్రోత్సాహం ఇచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.ఇంతటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయటంలో బుచ్చెశ్వరావు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.లిటిల్ చాంప్స్ అకాడమీ సెక్రెటరీ బుచ్చెశ్వరావు మాట్లాడుతూ సేవ చేస్తున్న వారిని గుర్తించి పురస్కారాలు ఇవ్వటం చాలా సంతోషమని అన్నారు.ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారికి పురస్కారాలు అందజేశారు.అలాగే కూచిపూడి చేసిన చిన్నారులకు ప్రోత్సాహకాలు అందజేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జడ సురేష్ బాబుఈ కార్యక్రమంలో పురిని శ్రీనివాసులు రెడ్డి, జర్నలిస్ట్ నాజీర్ అహమ్మద్, ఫిలిం యాక్టర్ దాసరి శ్వేత,డాక్టర్ మద్దాలి మాధవరావు,మరియు డాక్టర్ గడ్డం కృష్ణయ్య, డాక్టర్ పిడుగురాళ్ల శ్రీనివాస్ర్, బి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.