TG: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వెంబడి వ్యాపించిందని వాతావరణ అధికారులు వెల్లడించారు.