సిద్దిపేట జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం శివారులో అప్పుడే పుట్టిన శిశువు లభ్యమైనది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాం వద్ద వదిలి వెళ్లారు. కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువును బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.