“సామాజిక మార్పులతో భవిష్యత్తు ఉజ్వలం”
➡️సమ సమాజ స్థాపనలో, దేశాభివృద్ధి లో విద్యార్థులు,యువత పాత్ర గొప్పదని, సామాజిక మార్పులతో భవిష్యత్తు ఉజ్వలం అవుతుందని గజ్వేల్ పౌర సమాజం ప్రతినిధి అంబదాస్ అభిప్రాయపడ్డారు. స్థానిక విశ్వతేజ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘మార్పు కోసం,భవిష్యత్తు వైపు’ అనే చర్చాగోష్టి సమావేశంలో మాట్లాడుతూ విద్యాల్థనుద్దేశించి ప్రసంగించారు. చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న విద్యార్థులు ఎంతోమంది వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని, మద్యపానం డ్రగ్స్ వంటి మహమ్మారుల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే వారి లక్ష్యాన్ని చేరుతారని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా అధ్యాపకులు చెప్పినట్టుగా ఉంచుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లతో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని దానిని మంచి కోసం వాడాలి తప్ప చెడు జోలికి వెళ్లకూడదని అన్నారు. బంగారు భవిష్యత్తు కోసం ప్రయత్నించాలి, కానీ చిన్న వయసులోనే అసాంఘిక కార్యక్రమాలలో పాలుపంచుకొని కొంతమంది విద్యార్థులు నేరస్థులుగా మారడం దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థ సంఘ ప్రతినిధి సామాజిక సేవ కార్యకర్త చంటిమాట్లాడుతూ చిరునవ్వుతో మానసిక ప్రశాంతతో దేన్నైనా సాధించవచ్చని, సామాజిక స్పృహతో కూడిన విద్య దేశాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త దేశబోయిన నర్సింలు మాట్లాడుతూ విద్యార్థులు చెడుకు దూరంగా ఉండాలని, గాంధేయ మార్గంలో పయనించాలని అన్నారు.
కార్యక్రమంలో సామాజికవేత్త దేశ బోయిన నర్సింలు, తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల సంఘ ప్రతినిధి చంటి,కళాశాల ప్రిన్సిపల్ కొడారి రాజు, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు