రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకురి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన దేవునిపడకల్ గ్రామ ముఖద్వారాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, తెలంగాణ పట్టణ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్ తదితరుల తో కలిసి ప్రారంభించారు. నరసింహ రెడ్డి మాట్లాడుతూ… మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తన తండ్రి దోకురి రామిరెడ్డి జ్ఞాపకార్థం చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలను అభినందించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తన పుట్టిన రోజున మన రంగారెడ్డి జిల్లాకు రావడం చాలా సంతోషకరమని, మంత్రి జిల్లా అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలని కోరారు. అదేవిధంగా మన రాష్ర్టంలో ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను….
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో pacs చైర్మన్ గట్ల కేశవ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, యాట నరసింహ, భగవాన్ రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు, మాజీ జెడ్పీటీసీ లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, యువజన విభాగం నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.