మియాపూర్ మయూర్ నగర్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరగగా సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోరుకొండ కోచింగ్ సెంటర్ లో గత మూడేళ్లుగా గీతాంజలి(21) వార్డెన్ గా పనిచేస్తుంది. ఈనెల 5 నుండి సెలవులు కావడం తో కోచింగ్ సెంటర్ లోని అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోగా సెక్యూరిటీ గార్డులు, వార్డెన్ మాత్రమే ఉన్నారు. ఈనెల 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలుపగా కుటుంబ సభ్యులు మాత్రం గీతాంజలిది ఆత్మహత్య కాదని మానభంగం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.