అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝళిపించారు. శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ 21 హఫీజ్పెట్ డివిజన్ వైశాలి నగర్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన మూడు అక్రమ నిర్మాణానాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శివరాంపల్లి కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చడం జరిగింది. ప్రజలు, వివిధ సంఘాల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులు ఉదయమే చేరుకొని పోలీసుల సహకారంతో కూల్చి వేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలును ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల నిర్మూలన పూర్వం జిహెచ్ఎంసి, హెచ్ఎండియు పరిధిలో ఉండేది కాగా చెరువుల పరిరక్షణ కోసం నూతనంగా ఏర్పడిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఎలాంటి వివక్ష లేకుండా తన పని తాను చేసుకుపోతుంది.