గజ్వేల్ నియోజకవర్గం లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ , శిఖం భూములు కాపాడాలి
కబ్జా చేసిన భూములు ప్రభుత్వం తీసుకోవాలి
సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య
గజ్వేల్ నియోజకవర్గం లోని అనేక గ్రామాలలో ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, అసైన్మెంట్, వక్తుబోర్డు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ భూములు మాయమయ్యాయి అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడంతో పాటు కంపెనీలకు కట్టబెట్టడం జరిగింది వాటన్నిటిని సర్వే నిర్వహించి ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గజ్వేల్ నియోజకవర్గం హైదరాబాద్ కు దగ్గరగా ఉండడం రీజినల్ రింగ్ రోడ్ రావడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతం భూముల విలువ కోట్లాది రూపాయలు ఉంటున్నది దీంతో మర్కుకు మండలం ములుగు గజ్వేల్ మండలాల్లో గ్రామ కంఠం అసైన్మెంట్, శిఖము బఫర్ జోన్లలో భూములను కబ్జా చేయడం జరిగిందని అక్రమంగా నిర్మాణాలు ఏర్పాటు చేశారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా శిఖం బఫర్ జోన్ లో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయని, అనేక సంస్థలు,కంపెనీలు, పెట్రోల్ బంకులు నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అక్రమంగా ఆక్రమించిన వాటిని వెంటనే బయటకు తీయాలని హైదరాబాదులో హైడ్రా తరహాలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లు కాపాడాలని కబ్జాలు చేసిన వారిపై , ప్రభుత్వ రికార్డులు మార్చిన అధికారుల పైన, నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు