షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ అమలు చేయాలి వర్షాలతో నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య. రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని, వర్షాలతో నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుల రుణమాఫీకి షరతులు తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టల అవసరాల కోసం వందలాది ఎకరాల భూమిని రైతులకు తీసుకున్నదని దీంతో గత అనేక సంవత్సరాలుగా రైతులు భూములు కోల్పోవడం జరిగిందని మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్ మరియు పునరావాస కాలనీలా కోసం భూములను తీసుకున్నదని అన్నారు వాటి పరిధిలో వేలాది మంది రైతులు బ్యాంకులకు రుణాలు కలిగి ఉన్నారని వాటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు సర్వసంకోల్పోయిన రైతులు బ్యాంకు రుణాలను చెల్లించలేదని తెలిపారు దీంతో ఇతర అవసరాల కోసం బ్యాంకులో వేసిన డబ్బులను బ్యాంకు అధికారులు అకౌంట్లను సీజ్ చేయడంతో తమ యొక్క డబ్బులు ఇవ్వడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు భూములు కోల్పోయిన రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వరి మొక్కజొన్న పత్తి పంటలు నష్టపోవడం జరిగిందని సమగ్రంగా సర్వే నిర్వహించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ పత్రికా సమావేశంలో సిపిఎం నాయకులు ఎండి అహ్మద్ ఐలయ్య అఫ్జల్ పాల్గొన్నారు