*BRS పార్టీ సభ్యత ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు&దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డ ఈరోజు దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొద్ది నెలల క్రితం యాకటి కిష్టయ్య రోడ్డు ప్రమాదవశాత్తులో మృతి చెందారు. వారి కుటుంబానికి పార్టీ సభ్యత ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని తన కొడుకు చదువుల కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఏఎంసి డైరెక్టర్ నీరుడు సత్యనారాయణ గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం మృతి చెందారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని ఒకే సంవత్సరంలో ఇద్దరు ముఖ్య కార్యకర్తలను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలకు BRS పార్టీ ఎప్పుడు అండగా ఉంటాదని మనోధైర్యాన్ని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సయ్యద్ రహీముద్దీన్, దుబ్బాక బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, తాజా మాజా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు ,వెంకటయ్య గడ్డమీద సత్తయ్య, శివంది నర్సింలు,నీరుడి రాజనర్సు,పడాల లచ్చయ్య,గడ్డం నాగరాజ్,బాల్ రెడ్డి,రవీందర్ రెడ్డి,శివంది రాజేందర్,కుమ్మరి కరుణాకర్ తదితరులు ఉన్నారు.