గజ్వేల్: రూ.21వేల చెక్కు అందజేత గజ్వేల్ పట్టణంలోని పల్లెపహాడ్ గ్రామానికి చెందిన భాదితుడు శనిగరం భిక్షపతికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.21వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, ఎఫ్టీసీ మాజీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి చెక్కులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్ బొగ్గుల చందు, నాయకులు నవాజ్ మీరా, నరేష్, ప్రతాప్ తదితరులు ఉన్నారు.