గజ్వేల్: ప్రజలను ఛీటింగ్ చేసిన రేవంత్ రెడ్డి అబద్దపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రైతుకు రైతుబంధు కింద ఎకరానికి రూ.15000 ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం రూ.12000 మాత్రమే ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు.